Minister Mallareddy | సీట్లు అమ్ముకోవడమే తప్ప..అభివృద్ధి గురించి ఏం తెలుసు? రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి ఫైర్
Minister Mallareddy | నోటుకు సీట్లు అమ్ముకోవడమే తప్ప అభివృద్ధి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఏం తెలియదని మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy) ఆరోపించారు.
మేడ్చల్ : నోటుకు సీట్లు అమ్ముకోవడమే తప్ప అభివృద్ధి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఏం తెలియదని మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy) ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గంలో రేవంత్ (RevanthReddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదనే ధ్వేయంగా పెట్టుకున్న పీసీసీ చీఫ్‌ను ప్రజలు ఛీ కొడతారని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన అభివృద్ధి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలందరూ కళ్లారా చూస్తున్నారని పేర్కొన్నారు.
జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డుకు కాంగ్రెస్ పాలనలో అనుమతి ఇవ్వడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ద్వారా వందల కోట్ల నిధులను ఖర్చు చేసి జవహర్‌నగర్‌ను అభివృద్ధి చేసిందన్నారు. డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుందని వెల్లడించారు. 58, 59 జీవోలో అనేక మందికి ఇళ్ల పట్టాలను అందించామన్నారు.
మేడ్చల్‌లో ఐటీ పార్క్‌కు ఏర్పాటుకు రూ. 4 వందల కోట్లను ప్రభుత్వం మంజూరి చేసి టెండర్లను ఆహ్వానించిందని వివరించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై అవగాహన లేని పీసీసీ అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. మేడ్చల్, జవహర్‌నగర్‌లో నిర్వహించని రోడ్‌షోలకు స్పందన కరువైందని మంత్రి విమర్శించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

