
నల్లగొండ, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణప్రతినిధి): ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం నల్లగొండలో పర్యటించనున్నారు. కేటీఆర్‌తోపాటు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా నల్లగొండకు రానున్నారు. ఉదయం 10:30 గంటలకు నల్లగొండకు చేరుకొని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అక్కడే రూ.110 కోట్లతో నిర్మించనున్న ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేస్తారు. వెజ్ అండ్ నాన్‌వెజ్ సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, అధికారులతో కలిసి పట్టణంలో పర్యటిస్తారు. ప్రస్తుత అభివృద్ధితోపాటు చేపట్టాల్సిన పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆయన తండ్రి మారయ్యకు నివాళులు అర్పించనున్నారు. 3 గంటలకు నల్లగొండ కలెక్టరేట్లో జిల్లాలోని మున్సిపాలిటీలపై చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.