హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దీటైన జవాబిచ్చారు. మొత్తం 27 రోడ్లలో కేవలం 7 రోడ్లపై మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతిచ్చారని కిషన్‌రెడ్డికి ట్వీట్ చేశారు. ఇంకా 20 రోడ్లు మూసి ఉన్నాయని, లక్షల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్లను వెంటనే తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన మ్యాప్‌తోపాటు అక్కడ మూసేసిన, తెరిచిన రోడ్ల వివరాలను మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో పొందుపరిచారు.
కంటోన్మెంట్ పరిధిలో మూసేసిన రోడ్లు
తెరిచిన రోడ్లు