సిరిసిల్ల మానేరు వాగులో ఈతకు వెళ్లి మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. బుధవారం పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీకి వెళ్లిన మంత్రి.. మృతుల తల్లిదండ్రులను ఓదార్చారు. బిడ్డల లోటు తీర్చలేనిదని, కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. మానేరు వద్ద భవిష్యత్తులో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని, తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు.