హైదరాబాద్: మార్కెట్లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఇండ్లు నిర్మిచడం లేదని చెప్పారు. ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో నిర్మించిన 210 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మెయిన్ సెంటర్లో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇడ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో రూ.9714 కోట్లతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడుతున్నామని చెప్పారు.
కొల్లూరులో ఒకేచోట 15,640 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని తెలిపారు. వారం రోజుల్లో కొల్లూరులోని ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్లతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్హణ బాధ్యత లబ్ధిదారులదేనని చెప్పారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ కోసం రూ.100 కోట్ల విలువచేసే స్థలం కేటాయించామన్నారు. ఇందిరానగర్‌లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించిన ఇంజినీర్లు, సిబ్బందిని మంత్రి అభినందించారు.
ఇందిరానగర్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఐదంతస్తుల్లో 5 బ్లాక్‌ల్లో నిర్మించారు. సీసీ రోడ్డు, తాగునీరు, 7 లిఫ్టులు, 7 షాపులు, డ్రైనేజీ కాలువ వంటి అన్ని మౌలిక వసతులను కల్పించారు. ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని మొక్కలునాటి సుందరీకరణ పనులు చేపట్టారు.
Ministers @KTRTRS, @YadavTalasani, and @mahmoodalitrs inaugurated 2BHK Dignity Housing Colony at Indra Nagar in Khairatabad, Hyderabad. MLA Danam Nagender, Mayor @GadwalvijayaTRS, Dy Mayor @SrilathaMothe and other dignitaries graced the occasion. pic.twitter.com/evXSTL4phH
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 3, 2022
Live: MA&UD Minister @KTRTRS speaking after inaugurating 2BHK Dignity Housing Colony in Khairatabad https://t.co/BiDiGv7r79
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 3, 2022