జగిత్యాల : కులవృత్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని మోతె గ్రామం గొల్లపల్లి రోడ్డులో TUFIDC నిధులు రూ.2 కోట్లతో నిర్మించబోయే మోడ్రన్ దోబీ ఘాట్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల వృత్తులను కాపాడుకుకొనేందుకు సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రజకులకు హైదరాబాద్‌లో మూడు ఎకరాల స్థలం ఇచ్చి ఆత్మ గౌరవం నిలబెట్టారని మంత్రి తెలిపారు. 50 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పాలకులు అభివృద్ధిని గాలికి వదిలేసారిని విమర్శించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉండి అభివృద్ధి ఎందుకు చేయదని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రజకులు, కుమ్మరి, కమ్మరి, గౌడ తదితర వెనుకబడిన గుర్తించి వాళ్లను కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకు కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.