మంచిర్యాల : జిల్లాలోని కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి ప్రణయ్ అనే విద్యార్థిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు.
జైపూర్లోని గురుకులంలో ప్రథమ సంవత్సరం చదువుతున్న ప్రణయ్ లాంగ్ జంప్ విభాగంలో రాణిస్తూ బంగారు పతకాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.
జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్వర్ణ పథకాలను సాధిస్తున్న ప్రణయ్ ను హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొప్పుల సత్కరించి రూ. 3.5 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు.
అలాగే ప్రణయ్ ను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్, మండల నాయకులు
అభినందించారు.