హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తే అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కాచుకోవడానికి తాను ఉన్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అసెంబ్లీలో మంగళవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి బీఆర్ఎస్ చాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్టు కాదని అన్నారు. కేటీఆర్ కూడా తన కుర్చీ దగ్గరకు వచ్చి మాట్లాడారని, కాబట్టి ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లేనా అని ప్రశ్నించారు.
ఇదే తరహాలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కూడా కేటీఆర్‌ను కలిసి ఉంటాడని అన్నారు. ఆయన ఎకడికీ వెల్లడని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ నుంచి ఎల్పీ విలీనం కంటే ఎకువమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని చెప్పారు. త్వరలో ప్రధానిని కలుస్తానని, రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని తెలిపారు. వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఉప్పల్ – నారపల్లి ఫె్లై ఓవర్‌కు త్వరలోనే రీ టెండర్ నిర్వహిస్తామని తెలిపారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడుతామని, ఎస్ఎల్బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.