సంగారెడ్డి : సీఎం కేసీఆర్ పర్యటన కోసం నారాయణఖేడ్ ముస్తాబవుతోంది. సోమవారం సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నారాయణ ఖేడ్ లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం బహిరంగ సభ కోసం అన్నిఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాగా, సభా ఏర్పాట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం పరిశీలించారు. పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు సమన్వయంతో పక్కాగా చేయాలని మంత్రి పేర్కొన్నారు.