సిద్దిపేట : సిద్దిపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ మహారేణుకా ఎల్లమ్మ దేవి గౌడ కల్యాణ మండపాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు సిద్దిపేట చింతల చెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఉచిత చేప పిల్లలను వదిలారు.
రేణుకా ఎల్లమ్మ దేవి గౌడ కల్యాణ మండపాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్ రావు
అనంతరం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 7,200 మంది మత్స్యకారులకు సహచర మంత్రి తలసానితో కలిసి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, గీతా పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవిగౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.