వనస్థలిపురం, డిసెంబర్ 24 : రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు వచ్చినందున వనస్థలిపురం ఏరియా దవాఖాన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దవాఖాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే 90శాతం ఆక్యుపెన్సీ ఉన్న దవాఖానకు మరో 100 పడకలు అందజేయడం జరిగిందన్నారు. లిఫ్టు, చైల్డ్‌కేర్ సెంటర్, ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, త్వరలోనే వాటిని పూర్తి చేయిస్తామన్నారు. స్థానిక సమస్యలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జిట్టా రాజశేఖర్‌రెడ్డి, కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, చింతల రవికుమార్, అనిల్ చౌదరి, మాధవరం నర్సింహారావు, గంగం శివశంకర్, ఈశ్వరమ్మ యాదవ్, జిన్నారం విఠల్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, అజయ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.