చిన్నారులను అభినందించిన మంత్రి గంగుల
దుండిగల్, డిసెంబర్ 25 : హరిత హారం స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ నిజాంపేటకు చెందిన చిన్నారులు ముందుకు కదిలారు. నిజాంపేటకు చెందిన చల్లా రాము బ్యాంక్ ఆఫ్ ఆమెరికాలో పనిచేస్తున్నారు. ఆయన పిల్లలు బి.దిశిత (11), సాహర్ష్ (7) తమ తల్లిదండ్రులు రాము, ప్రవీణ తెచ్చిన మామిడి పండ్లలోని పిక్కలు తీసి టిష్యూ పేపర్లు, కవర్లలో ఉంచారు. చిన్న చిన్న మొక్కలు వచ్చిన తరువాత వాటిని కప్పులో వేసి పెంచడం ప్రారంభించారు. ఇలా సుమారు 200 మామిడి పిక్కలను మొక్కలుగా మార్చారు. విషయం తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ చిన్నారులను అభినందించారు.