నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | నిరుపేద సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంలోని

వరంగల్ రూరల్ : నిరుపేద సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల జారీకి, ఇండ్ల నిర్మాణాల కోసం ప్రక్రియ జరుగుతుందన్నారు. దళితులకు రూ.10లక్షలు ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ రూపొందించి, అమలు చేస్తున్నారన్నారు.
కరోనాతో చాలా రాష్ట్రాల్లో పెన్షన్ల పంపిణీ నిలిపివేసినా.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తెలంగాణలో పెన్షన్లు మాత్రం ఆపలేదన్నారు. కేంద్రం సహకరించకున్నా పేదల కోసం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని నిలిపివేయలేదని చెప్పారు. అప్పులు తెచ్చి అన్నింటినీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రూ.167కోట్లను రైతుబంధు కోసం రూరల్ జిల్లాలోనే ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రతీ గ్రామం అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో 1.87లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రూ.40లక్షల వ్యయంతో కరోనా నివారణకు నియోజకవర్గంలో హోమియోపతి మందులు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిత, ఎంపీపీ అనిమిరెడ్డి, తహశీల్దార్ సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Tokyo Olympics: ఫెన్సింగ్ రెండో రౌండ్లో ఓడిన భవానీ దేవి
Tokyo Olympics: టీటీ మూడో రౌండ్లోకి ప్రవేశించిన శరత్ కమల్
దేశంలో కొత్తగా 39,361 కరోనా కేసులు
శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న వరద
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

