హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : రక్తం అందుబాటులో లేక ఏ రోగికీ చికిత్స ఆలస్యం కావద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. గురువారం జాతీయ వలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సనత్‌నగర్ టిమ్స్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల్లో గాయపడినవారు, ప్రసవ సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే తల్లులు, తలసేమియా చిన్నారులు, క్యాన్సర్ రోగులు, శస్త్రచికిత్స అవసరమైన వారికి రక్తం కీలకమని తెలిపారు. స్వచ్ఛంద రక్తదానానికి యువత ముందుకొస్తే, అత్యవసర సమయంలో రక్తం కోసం కుటుంబాలు ఇబ్బందిపడే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.