ముంబై, అక్టోబర్ 1: మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దివేగర్ బీచ్‌లో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. ఈ బీచ్‌లో స్నానానికి దిగిన 8 మంది టీనేజ్ యువకులు తీవ్రంగా వచ్చిన కెరటాలకు నీటమునిగి మరణించారు. వారి మృతదేహాలు లభ్యమయ్యాయని, మృతులందరూ 16 ఏండ్ల వయసువారేనని పోలీసులు తెలిపారు. పుణె జిల్లాకు చెందిన విన్నర్స్ అకాడమీ అనే ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన 48 మంది విహారయాత్ర నిమిత్తం 170 కి.మీ దూరంలోని దివేగర్ బీచ్‌కు వచ్చారు. అందులో 8 మంది సాయంత్రం స్నానం చేస్తుండగా లోతు తెలియక నీటమునిగి, కెరటాలకు కొట్టుకుపోయి మరణించినట్టు అధికారులు తెలిపారు.