ఖమ్మం, ఫిబ్రవరి 16: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ చూపిన మార్గంలో సుపరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ మరో మహాత్ముడని కొనియాడారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సంక్షేమం కోసం జనరంజక పాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్ దేశానికి, రాష్ర్టానికి దిక్సూచిగా నిలిచారని అన్నారు. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలిసిన శక్తి కేసీఆర్ అని అన్నారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసుకునేలా వ్యూహాలను ప్రదర్శించి ప్రజల గుండెల్లో నిలిచిన దేవుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆయన రూపొందించి అమలు చేస్తున్న పథకాలు కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు.