MiG-21 Fighter jet | భారత వైమానిక దళం (IAF) చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫైటర్ జెట్ మిగ్-21 (MiG-21) శకం ముగిసింది. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత మిగ్ ఫైటర్ జెట్లు రిటైర్ అయ్యాయి. భారత వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా వెన్నముక వలే ఉండి.. ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన ఈ ఫైటర్ జెట్స్‌కు చండీగఢ్ వాయుసేన కేంద్రం వేదికగా జరిగిన ఫేర్వెల్ కార్యక్రమంలో వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ (Air Chief Marshal AP Singh) నేడు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ అధికారులు, మాజీలు హాజరయ్యారు.
#WATCH | Chandigarh | MiG-21s receive a water gun salute as they decommission after 63 years in service. pic.twitter.com/cPWLHBDdzs
— ANI (@ANI) September 26, 2025
మిగ్-21 ఫైటర్ జెట్స్.. 1963లో ఐఏఎఫ్‌లో చేరాయి. భారత వైమానిక దళం (IAF) ఫైటర్ జాబితాలో మొట్టమొదటి సూపర్సోనిక్ విమానం. అప్పటి నుంచి మిగ్-21 యుద్ధ విమానాలు భారత్‌కు వెన్నెముకగా నిలిచాయి. 1965, 1971లలో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాలు, 1999లో కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్ సహా అనేక కీలక ఆపరేషన్లలో ముఖ్య పాత్ర పోషించాయి. వేగం, చురుకుదనం, పోరాట పటిమతో ఈ విమానం భారత సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయాలు సాధించాయి.
#WATCH | Chandigarh | All airborne MIG-21 aircraft execute their final operational landing simultaneously.
MiG-21s were inducted into the Indian Air Force in 1963, and will be decommissioned today after 63 years of service. pic.twitter.com/uDnMXpG0Rr
— ANI (@ANI) September 26, 2025
అయితే, విజయాలతోపాటూ పలు అప్రతిష్ఠలు కూడా మూటగట్టుకుంది. తొలినాళ్లలో ‘ఫ్లయింగ్ డాగర్’ (Flying Daggers)గా పేరుపొందిన ఈ విమానం సాంకేతికత పాతదైపోవడం, తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో ‘ఎగిరే శవపేటిక’ (Flying Coffin) అనే అప్రతిష్ఠను మూటగట్టుకుంది. 1963 నుంచి ఇప్పటివరకు సుమారు 400 మిగ్-21 జెట్లు కూలిపోగా, సుమారు 200 మంది పైలట్లు, 40-60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఫేర్వెల్ సందర్భంగా సార్టి పూర్తి చేసుకొని ల్యాండ్ అయిన ఈ ఫైటర్ జెట్స్‌కు జలఫిరంగులతో అభివాదం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు.
#WATCH | Chandigarh | BAe Hawk Mk132 aircraft of the Indian Air Force’s Surya Kiran Acrobatics team perform manoeuvres during the decommissioning ceremony of the MiG-21 fighter aircraft fleet. pic.twitter.com/ZYewynf79D
— ANI (@ANI) September 26, 2025
#WATCH | Chandigarh | BAe Hawk Mk132 aircraft of the Indian Air Force’s Surya Kiran Acrobatics team perform manoeuvres during the decommissioning ceremony of the MiG-21 fighter aircraft fleet. pic.twitter.com/pv3hImr8jp
— ANI (@ANI) September 26, 2025
Also Read..
Saree Theft | అమానుషం.. చీరలు దొంగిలించిందని మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి.. VIDEO
Harjit Kaur: 33 ఏళ్లుగా అమెరికాలో.. 73 ఏళ్ల సిక్కు మహిళ స్వదేశానికి గెంటివేత