Harjit Kaur: 33 ఏళ్లుగా అమెరికాలో.. 73 ఏళ్ల సిక్కు మహిళ స్వదేశానికి గెంటివేత
Harjit Kaur: అమెరికాలో 33 ఏళ్లుగా అక్రమంగా ఉంటున్న సిక్కు మహిళ హర్జిత్ కౌర్‌ను డిపోర్టు చేశారు. 73 ఏళ్ల ఆ సిక్కు మహిళ పేరు హర్జిత్ కౌర్. కాలిఫోర్నియాలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు కొన్ని రోజుల క్రితం ఆమెను నిర్బంధించి బలవంతంగా ఢిల్లీకి పంపారు.
చండీఘడ్: అమెరికాలో 33 ఏళ్లుగా అక్రమంగా ఉంటున్న సిక్కు మహిళ హర్జిత్ కౌర్(Harjit Kaur)ను డిపోర్టు చేశారు. 73 ఏళ్ల ఆ సిక్కు మహిళ పేరు హర్జిత్ కౌర్. కాలిఫోర్నియాలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు కొన్ని రోజుల క్రితం ఆమెను నిర్బంధించారు. బలవంతంగా ఆమెను ఇటీవల ఢిల్లీకి పంపారు. ఆశ్రయం కల్పించాలని చాన్నాళ్ల క్రితమే ఆమె అభ్యర్థన పెట్టుకున్నది. కానీ అమెరికా ఆ అభ్యర్థనను తిరస్కరించింది. కనీసం తమ బంధువులకు గుడ్‌బై చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె తరపున అడ్వకేట్ తెలిపారు. దీపక్ అహ్లువాలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రియాక్ట్ అయ్యారు. బీబీజీ పంజాబ్ వెళ్తోందని, ఆమె ఇండియాలో ల్యాండైందని ఆయన అన్నారు.
అమెరికాలో సరైన రీతిలో జీవించానని, పని చేశానని, పన్నులు చెల్లించాలని, అయినా తనను క్రూరంగా గెంటివేశారని ఆమె ఆరోపించారు. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో జీవించింది. అక్కడ బెర్కిలేలోని ఓ బట్టల దుకాణంలో పనిచేసింది. మోకాలి సర్జరీల వల్ల ఆమె ఉద్యోగం ఇటీవల మానేసింది. సెప్టెంబర్ 8వ తేదీన రోటిన్‌గా జరిగిన ఇమ్మిగ్రేషన్ చెకింగ్ సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆశ్రయం కల్పించాలని కోరుతూ 2012లో ఆమె చివరిసారి దరఖాస్తు చేసుకున్నది. కానీ ఆ దరఖాస్తును ఇమ్మిగ్రేషన్ శాఖ తిరస్కరించింది. జార్జియా, అర్మేనియా మీదుగా మరికొంత మందితో ఆ సిక్కు మహిళను ఢిల్లీకి తీసుకువచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

