ఆదిలాబాద్ : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న పథకాలు కొనసాగించకా, నిధులు మంజూరు చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు చేయడంతో పాటు ఇతర సమస్యల సాధన కోసం జిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు.
విధులు బహిష్కరించి కార్మికులు నిరసన తెలపడంతో బడుల్లో చదువుతున్న పిల్లలు పస్తులు ఉండాల్సి వచ్చింది. కొన్ని చోట్ల విద్యార్థులు ఇంటి నుండే మధ్యాహ్న భోజనం తెచ్చుకుని కడుపు నింపుకున్నారు. ప్రభుత్వ బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఓ వైపు ప్రభుత్వం గొప్పలు చెప్తుంటే..గతంలో సజావుగా సాగిన పథకాలు సైతం ఇటకెక్కుతున్నాయనడానికి వీరి ఆందోళనలే అద్దం పడుతున్నాయి.