మెక్సికో సిటీ : ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్లో ఆతిథ్య మెక్సికో అదిరిపోయే బోణీ కొట్టింది. రికార్డు స్థాయిలో మూడోసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న మెక్సికో.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూపు-ఏ తొలి పోరులో 2-0తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మెక్సికో తరఫున జులియన్ క్యునినోస్(9ని) టోర్నీలో తొలి గోల్ కొట్టగా.. రౌల్ జిమినెజ్(67ని) రెండో గోల్ సాధించాడు.
మరో గ్రూపు-ఏ పోరులో దక్షిణకొరియా 2-1తో చెక్రిపబ్లిక్పై విజయం సాధించింది. ద్వితీయార్ధంలో బోయెమ్ (67ని), హ్యుయాన్ (80ని) కొరియా తరఫున గోల్స్ చేయగా, లదిస్లావ్ క్రెజి (59ని)..చెక్ రిపబ్లిక్కు ఏకైక గోల్ అందించాడు.
అమెరికా X పరాగ్వే ఉ. 6.30 నుంచి
ఖతార్ X స్విట్జర్లాండ్ రా. 12.30 నుంచి
బ్రెజిల్ X మొరాకో తె.జా. 3.30 నుంచి