టాటా వాహనాలు ప్రియం
టాటా మోటర్స్ కూడా వాహన ధరలను పెంచేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 1.5 శాతం వరకు సవరించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంటర్నల్ కంబూస్టన్ ఇంజిన్, ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ప్రియంకానున్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 12 : టాటా మోటర్స్ కూడా వాహన ధరలను పెంచేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 1.5 శాతం వరకు సవరించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంటర్నల్ కంబూస్టన్ ఇంజిన్, ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ప్రియంకానున్నాయి. గడిచిన మూడు నెలల్లో ధరలు పెంచడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఏప్రిల్ 1న వాహన ధరలను సవరించిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే వాహన ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం అధికం కావడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా ధరలను స్వల్పంగా సవరించాల్సి వచ్చిందని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇప్పటికే మారుతి, హ్యుందాయ్ సంస్థలు తమ వాహన ధరలను రూ.30 వేల వరకు పెంచిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

