క్రికెట్‌కు విలియమ్సన్ వీడ్కోలు
న్యూజిలాండ్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. తన కళాత్మక ఆటతీరుకు తోడు మెండైన నాయకత్వ ప్రతిభతో దేశ క్రికెట్‌కు అసమాన విజయాలు అందించిన 35 ఏండ్ల కేన్ విలియమ్సన్ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. తన 16 ఏండ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు విలియమ్సన్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు.
క్రైస్ట్‌చర్చ్ : న్యూజిలాండ్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. తన కళాత్మక ఆటతీరుకు తోడు మెండైన నాయకత్వ ప్రతిభతో దేశ క్రికెట్‌కు అసమాన విజయాలు అందించిన 35 ఏండ్ల కేన్ విలియమ్సన్ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. తన 16 ఏండ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు విలియమ్సన్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ నుంచి ప్రపంచక్రికెట్‌కు దక్కిన అద్భుత ప్లేయర్‌గా అందరిచేత మన్ననలు అందుకున్న విలియమ్సన్ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు.
గతేడాదే టీ20లకు దూరమైన ఈ కివీస్ దిగ్గజం తాజాగా వన్డే, టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న న్యూజిలాండ్ టీమ్‌కు ఎంపికైన విలియమ్సన్ తన అనూహ్య నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కివీస్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 378 మ్యాచ్‌లాడిన విలియమ్సన్ 19,346 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 48 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు ఉన్నాయి. విలియమ్సన్ సారథ్యంలో కివీస్ 2021లో తొలిసారి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

