మాస్కో/కీవ్, అక్టోబర్ 5: రష్యాలో నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాల విలీన ప్రక్రియ పూర్తయిందని రష్యా అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రష్యా పార్లమెంట్ ఆమోదించి పంపిన విలీన ఒప్పందాలపై అధ్యక్షుడు పుతిన్ బుధవారం సంతకం చేశారని స్థానిక మీడియా పేర్కొన్నది. దీంతో ఈ ఒప్పందాలు చట్టాలుగా మారాయి. కాగా, ఇది ఓ పనికిమాలిన చర్య అంటూ ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తీవ్రంగా మండిపడింది.