హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఫార్మారంగంలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 11న మెగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.
మహబూబ్‌నగర్ పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ డ్రైవ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 8 లోపు https: //forms.gle/ctBZNQ1ByU5B6xKB6 లింక్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాల కోసం 98494 45877 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.