తిరుమల : ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరస్వామికి వివిధ రూపేణా విరాళాలు ( Donations )వెల్లువెత్తుతున్నాయి . హైదరాబాద్ కు చెందిన త్రిశూల్ ఎంటర్ ప్రైజర్స్ సంస్థ అధినేతలు చక్రధర్ (Chakradar) , శివరంజని ( Shivaranjanini) అనే భక్తులు గురువారం టీటీడీకి రూ.78 లక్షలు విలువైన ఔషధాలను విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు ఔషధాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ పాల్గొన్నారు.
శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం

చెన్నైకు చెందిన పొన్నయ నాగేశ్వరన్ అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.