గుంటూరు జీజీహెచ్‌లో రఘురామకు వైద్య పరీక్షలు
గుంటూరు జీజీహెచ్‌లో రఘురామకు వైద్య పరీక్షలు | నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణకు గుంటూరులోని జీజీహెచ్ వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

అమరావతి : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణకు గుంటూరులోని జీజీహెచ్ వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని రఘురామకృష్ణ రాజు సీఐడీ కోర్టుకు తెలిపిన విషయం విధితమే. ఆయన తరఫున న్యాయవాదులు సైతం విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఉదయం 10.30 గంటల వరకు పరీక్షలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని జిల్లా కోర్టు, మధ్యాహ్నం 12 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ శనివారం ఆదేశించింది. ఈ క్రమంలో ఆదివారం ఆయనను పరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించగా జాప్యం జరుగుతోంది. వైద్య పరీక్షల్లో ఆలస్యంగా ఎంపీ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎంపీకి రమేశ్ హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు శనివారం ఆదేశించింది.
ప్రస్తుతం ఇక్కడే పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలించేలా రఘురామకృష్ణ వ్యాఖ్యలు చేశారని రెండు రోజుల కిందట సీఐడీ అధికారులు ఆయనను హైదరాదాబాద్‌లో అరెస్టు చేశారు. దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. జిల్లా కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై నేడు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చట్టవిరుద్ధంగా తన తండ్రిని ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎంపీ తనయుడు భరత్ ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంశాఖ సెక్రెటరీ అజయ్ భల్లాకు లేఖ రాసినట్లు తెలిసింది. విచారణ సమయంలో తీవ్రంగా హింసించారని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తగ్గని ఉద్రిక్తలు
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్ భగవత్
దేశంలో 3.11లక్షల కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
సింగిల్ డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’కు వెనిజులా ఆమోదం
హైదరాబాద్‌కు చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు
కరోనా సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూత
‘స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా వినియోగించుకోండి’
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

