బూర్గంపహాడ్, ఆగస్టు 07 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో శుక్రవారం వైఆర్టీజీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో హెచ్ఐవీ, సిఫిలిస్ రక్తపోటు, మధుమేహం, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి సీజనల్ వ్యాధుల నివారణపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. వైఆర్జే కేర్ సూపర్వైజర్ లక్ష్మి, ఎంఎల్హెచ్పీ జ్యోతి మాట్లాడుతూ.. హెచ్ఐవీ నాలుగు మార్గాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని, హెచ్ఐవీ అంటువ్యాధి కాదని అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో లింక్ వర్కర్ కుమారి, మొదటి ఏఎన్ఎంలు నాగదేవి, ఏఎన్ఎం సుజాత, ఆశావర్కర్లు, గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.