హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రా జ్యాంగబద్ధ హక్కు అని తెలంగాణ ఫుడ్ కా ర్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులోని క్లాజ్-3 ప్రకారం వేరే మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా నిరాకరించడం రాజ్యాంగం ప్ర సాధించిన సమానత్వం, మత స్వేచ్ఛ సూత్రాలకు విరుద్ధమని స్పష్టంచేశారు. ఇటీవల సు ప్రీంకోర్టు తీర్పు కూడా ప్రస్తుత చట్ట పరిమితులను ఎత్తిచూపినందున 1950 ఉత్తర్వును సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాం లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు.
1950 ఆగస్టు 10న జారీ చేసిన జీవోను నిరసిస్తూ ఢిల్లీలో నిర్వహించిన ‘బ్లాక్ డే’ ధర్నాకు బీ ఆర్ఎస్ సంపూర్ణ మ ద్దతు తెలిపినట్టు చెప్పా రు. పార్లమెంట్లో ప్ర వేశపెడుతున్న ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు-2026పై కూడా ఆయ న ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సవరణతో దేశవ్యాప్తంగా సామాజిక, విద్యా, వైద్య సేవ లందిస్తున్న వేలాది స్వచ్ఛంద సంస్థలు, క్రైస్తవ సేవా సంస్థల కార్యకలాపాలకు పరిపాలనా, ఆర్థికపరమైన ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న కుల వివక్షను పరిగణనలోకి తీసుకుని పార్లమెంట్ వేదికగా తగిన రాజ్యాంగ సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా హకులు, సామాజిక రక్షణ పొందుతారని అభిప్రాయపడ్డారు.