ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ మేడారం మహా జాతర సందర్భంగా తల్లులను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పూర్తి వివరాలతో కూడిన ఆన్లైన్ వెబ్ సైట్ను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గురువారం కలెక్టరేట్లో ప్రారంభించారు.
www.medaramjathara.com అనే వెబ్సైట్ ద్వారా జాతరలోని విశేషాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన మరుగుదొడ్ల వివరాలు, స్నాన ఘట్టాలు, కళ్యాణ కట్టల వివరాలు, ఆర్టీసీ బస్టాండ్ వివరాలు, పార్కింగ్ స్థలాలవంటి వాటిని పొందుపరిచినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. భక్తుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.