మెదక్ మున్సిపాలిటీ, మార్చి 19 : 2021-22 ఆర్థిక సంవత్సరానికి వంద శాతం పన్ను వసూళ్ల లక్ష్యంగా మెదక్ మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. పట్టణ ప్రజలు తమ ఆస్తి, నల్లా బిల్లులు చెల్లించేందుకు 12 రోజుల గడువు మాత్రమే ఉన్నది.
2021-22 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుండడంతో మున్సిపల్ అధికారులు ఆరు బృందాలు ఏర్పడి ఇంటింటికీ తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీలకు ఆస్తి పన్ను, నల్లా, ఇతర పన్నులే ప్రధాన ఆదాయం. పట్టణం విస్తరి స్తుండడంతో భవన నిర్మాణాలు సైతం పెరుగుతున్నాయి. ఆదే స్థా యిలో ఆస్తి పన్ను, నల్లా బిల్లుల ఆదాయం పెరుగుతున్నది. ము న్సిపాలిటీలోని నివాసగృహాలు, దుకాణా సముదాయల యజమానులు ఆస్తి పన్నును సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నెల 31 వరకు ఆస్తి పన్నులు చెల్లించని, వారి ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం ప్రచార వాహనాలను సైతం సిద్ధం చేశారు. అత్యధిక బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశారు. మెదక్ మున్సిపాలిటీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో శతశాతం, 2019 -20లో 96శాతం, 2020-21లో 98శాతం పన్నులను వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా వంద శాతం పన్నులను వసూలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆస్తి పన్ను చెల్లించకుంటే చర్యలు…
మెదక్ పట్టణంలో నివాస గృహాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మొత్తం 11,351 ఉన్నాయి. వీటి ద్వారా రూ. 4.04 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉంది. ఈ నెల 19వ తేది వరకు రూ.3 కోట్ల 8 లక్షలు వచ్చాయి. ఆస్తిపన్నుతో పా టు బకాయిదారులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా.. పన్నులు చెల్లించని వా రికి రెడ్ నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకుంటే వ్యా పార సముదాయాలు, ఇండ్లను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి..
వారం రోజులే గడువు ఉండటంతో మొండి బకాయిదారులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మొండి బకాయిదారులపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు పన్నులను చెల్లించడానికి బల్దియాకు వస్తున్నారు.
వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించే అవకాశం…
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్ శాఖ ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను 9000253342 గతేడాది అం దుబాటులోకి తెచ్చింది. దీంతో మున్సిపల్ సేవలు మరింత సులభతరమయ్యాయి. 9000253342 నంబరుకు చాట్ చేసి బకా యిదారులు తాము చెల్లించాల్సిన పన్ను వివరాలను తెలుసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మినహ 140 మున్సిపాలిటీలకు సం బంధించి ఎవరైనా వివరాలు తెలుసుకొని పన్ను చెల్లించవచ్చు. వాట్సాప్ నంబర్‌ను సెల్ఫోన్లో సేవ్ చేసుకొని క్లిక్ చేయగానే మున్సిపల్‌శాఖ స్వాగత సమాచారం అందుతుంది. తెలుగు లేదా ఇంగ్లిషులో మున్సిపల్ సమాచారం పొందే వీలు కల్పించారు.
వందశాతం వసూలు చేస్తాం..
వంద శాతం పన్ను వసూళ్లకు చర్యలు తీ సుకుంటున్నాం. ప్రత్యేక బృందాలను నియమించాం. ప్రణాళికబద్దంగా బకాయిలను వసూలు చేస్తున్నాం. ఇప్పటికే సుమారు 80 శాతానికి పైగా పన్ను వసూలు చేశాం. మిగతా బకాయిలను వారం రోజుల్లో వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆస్తిపన్ను చెల్లింపులో మున్సిపాలిటి సిబ్బందికి సహకరించాలి.
-శ్రీహరి, మెదక్ మున్సిపల్ కమిషనర్