బొల్లారం, మార్చి 12 : పారిశ్రామికవాడకు చెందిన ఓ కుటుంబం ఎదుర్కొంటున్న దయనీయ స్థితికి చలించిన కలెక్టర్ హనుమంతరావు కుటుంబానికి అండగా నిలిచారు. బొల్లారం పారిశ్రామికవాడలోని శ్రీరామ్ నగర్కాలనీకి చెందిన రమేశ్ అనేవ్యక్తి కొన్ని రోజుల కిందట మృతి చెందాడు. రమేశ్ మృతితో భార్య, నలుగురు ఆడ పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థి క ఇబ్బందులతో నలుగురు ఆడపిల్లల పోషణభారం తల్లికి బరువైంది. విషయం తెలుసుకున్న స్థానిక కేజేఆర్ ఫౌండేషన్ ఫౌండర్ ఆనంద్కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా నిలిచారు. ట్రస్టు ద్వారా తక్షణ సహాయం అం దించి మానవత్వాన్ని చాటారు. అంతటితో ఆగకుండా కలెక్టర్ హనుమంతరావు దృష్టికి కుటుంబ పరిస్థితిని తీసుకెళ్లారు.
కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ బాధిత కుటుంబానికి అండగా నిలువాలని జిన్నారం తహసీల్దార్ దశరథ్ను ఆదేశించారు. కుటుంబం ఎదుర్కొంటు న్న ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం తహసీల్దార్, ఆర్ఐలు బొల్లారంలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కలెక్టర్ ఆదేశాలతో ముందుకు వచ్చిన బీడీఎల్ భానూర్ ఎంప్లాయిస్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు రఘు కుటుంబాన్ని పరామర్శించి కావాల్సిన నిత్యావసర సరుకులను సంవత్సరం పాటు అందిస్తామన్నారు. అదే విధంగా నలుగు రు ఆడపిల్లల చదువులకు అవసరమైన బుక్స్, బ్యాగు లు, డ్రెస్సులను అందిస్తామని తెలిపారు. అప్పటి వరకు కుటుంబానికి అండగా ఉంటామని కేజేఆర్ ట్రస్టు ముం దుకు వచ్చింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు రవీందర్రెడ్డి, శారద, ఆర్ఐ పవన్, వీఆర్ఏలు, స్థానికులు పాల్గొన్నారు.