సిద్దిపేట అర్బన్, మార్చి 7 : మహిళా సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రం, సిద్దిపేట రూరల్ మండల ఎంపీపీ కార్యాలయ ఆవరణలో మహిళా బంధు సంబురాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పురుషులతో సమానంగా మహిళలకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు కల్పించిందన్నారు. మహిళలు బిందెలు పట్టుకొని నీటి కోసం బయటకు వెళ్లకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని తీసుకొచ్చారన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవీచందర్రావు, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, ఎంపీడీవో సమ్మిరెడ్డి, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
మహిళా బంధు సంబురాలు..
సిద్దిపేట మార్చి 7 : మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, కౌన్సిలర్లు బాలలక్ష్మి, భాగ్యలక్ష్మి, కవిత, శ్రీదేవి, కావేరి, దీప్తి, రేణుక, జయ, శ్రీలత, సులోచన, శోభారాణి, కవిత, వరాల కవిత, ప్రజాప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు.