కోహెడ, జూన్ 16 : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్‌కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌తో కలిసి శ్రీరాములపల్లిలో రైతు వేదిక, గొట్లమిట్లలో మహిళా సంఘ భవనం, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. వరికోలులో రైతు వేదిక, ముదిరాజ్ కమ్యూనిటీ భవనం, తంగళ్లపల్లిలో పల్లె ప్రకృతివనం, తెలంగాణ క్రీడామైదానం, సీసీ రోడ్లను ప్రారంభించారు. శనిగరంలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరాములపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం అన్నారు.
ప్రాజెక్టులు పూర్తికావొచ్చాయన్నారు. ఐదు వేల ఎకరాలకు ఒక రైతు వేదికను నిర్మించి రైతులకు సేవలు అందిస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు, రైతులు అరిగోస పడ్డారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల కష్టాలు తీరుతున్నాయన్నారు. ఒక నాడు ఎకరాకు రూ.3 లక్షలు లేని భూముల ధర ఇప్పు డు 20 నుంచి 30 లక్షల విలువకు పెరిగాయన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకోవడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను అడ్డుకున్నారన్నారు. ఇప్పుడు గౌరవెల్లి రిజర్వాయర్‌ను అడ్డుకుంటున్నారన్నారు.
కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. మిగతా ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా తెచ్చినవా బండి సంజయ్ అని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మా ట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, సాగునీటిని అందించి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేసే గౌరవెల్లి రిజర్వాయర్‌ను అడ్డుకోవడమే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పనిగా పెట్టుకున్నాయన్నారు. గౌరవెల్లి సామర్థ్యాన్ని 1.5 నుంచి 8.4 టీఎంసీలకు పెంచి పూర్తిచేశామన్నా రు. భూ నిర్వాసితులకు డబ్బులు అందజేశామన్నారు.
రాజకీయ పబ్బం గడుపుకునేందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామ ల, ప్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు, ఆర్డీవో జయచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, జిల్లా నాయకులు కొక్కుల సురేశ్, నాగరాజు మధుసూదన్‌రావు, తిప్పారపు శ్రీకాంత్, పొన్నాల లక్ష్మణ్, ఇప్పరపల్లి కృష్ణమూ ర్తి, భీంరెడ్డి రాజిరెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం, అబ్దుల్ ఖదీర్, ఇన్చార్జి తహసీల్దార్ రమే శ్, ఇన్చార్జి ఎంపీడీవో రాఘవేంద్రరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.