Medak | ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరిగా పాటించాలి.. పోలీస్ సిబ్బంది మెదక్ అదనపు ఎస్పీ కీలక సూచనలు
Medak | మెదక్, జనవరి 3(నమస్తే తెలంగాణ): పోలీసులు విధి నిర్వహణలో భాగంగా క్రమశిక్షణతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరిగా పాటించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ సూచించారు.
Medak | మెదక్, జనవరి 3(నమస్తే తెలంగాణ): పోలీసులు విధి నిర్వహణలో భాగంగా క్రమశిక్షణతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరిగా పాటించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ సూచించారు. శనివారం ఉదయం మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కవాతుకు ఆయన హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్‌ను పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి, నిర్ణీత వేగ పరిమితుల్లో వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞను పఠనం చేశారు “నేను భారతదేశ పౌరుడిగా, మోటార్ వాహనాల చట్టంలో పొందుపరచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢసంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను” అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు మహేశ్, కృష్ణమూర్తి, ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

