
చిలిపిచెడ్,అక్టోబర్ 30:ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేసి మద్దతు ధరను అందజేస్తున్నదని నర్సాపూర్ ఎ మ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం చిలిపిచెడ్ తో పాటు వివిధ గ్రామాల్లో సోమక్కపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, ఏపీఎం ప్రేమలతతో కలిసి రాష్ట్ర కార్మిక శాఖ చైర్మన్ దేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీవో శశిప్రభ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి, సొసైటీ వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, మండల కో-అప్షన్ సభ్యుడు షఫీ, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ నగేశ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, సర్పంచులు మాంతప్ప, మమత, పరశురాంరెడ్డి, ఇస్తారి, మనోహర, కవిత, గోపాల్‌రెడ్డి, అశోక్‌గౌడ్, స్రవంతి లక్ష్మణ్, ఎంపీటీసీలు శుభాష్‌రెడ్డి, మల్లమ్మ, మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ చైర్మన్‌తో కలిసి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకలు,అధికారులు ఉన్నారు.
సులభంగా ప్రయాణం చేయవచ్చు
వాహనదారులకు డబుల్ రోడ్డుతో సులభంగా ప్రయాణం చేయవచ్చుని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి,రాష్ట్ర కార్మిక శాఖ చైర్మన్ దేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని శీలాంపల్లిలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో శీలాంపల్లి-అంతారం వరకు డబుల్ రోడ్డు 9.5 కిలోమీటర్ల, రూ.6.70 కోట్లతో పనులను వారు ప్రారంభించారు.అనంతర ం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 6 సబ్స్టేషన్లు మంజూరై టెండర్లు వేస్తారన్నారు. కార్యక్రమం లో పీఆర్ ఎస్సీ కనకరత్నం,పీఆర్ఏఈ మధుబాబు, జడ్పీ సీఈ వో శైలేశ్, కాంట్రాక్టర్ నర్సింహారెడ్డి, ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి,మండల నాయకులు పాల్గొన్నారు.
బస్సు స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే:
మండలంలోని చండూర్‌కు చెందిన చౌటకూరి గోవర్ధన్‌రెడ్డి బ్రదర్స్ చౌటకూరి లచ్చమ్మ-చెన్నారెడ్డి గారి జ్ఞాపకార్థం తో బస్సు స్టేషన్ ఏర్పాటు చేశారు. శనివారం మండలంలో చం డూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బస్సు స్టేషన్‌ను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో దాత చౌటకూరి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే
వెల్దుర్తి, అక్టోబర్ 30: వెల్దుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల్లో వెల్దుర్తి సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రారంభించనున్నారని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్దుర్తితో పాటు చర్లపల్లి, మానేపల్లి, మంగళపర్తి, అందుగులపల్లి, కుకునూర్, మన్నెవారి జలాల్పూర్, ధర్మారం, దామరంచ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ను ప్రారంభిస్తారన్నారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు, రైతులు హాజరై విజయవంతం చేయాలన్నారు. మానేపల్లి పెద్ద చెరువులో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లలను వదులనున్నట్లు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహక సమావేశం
రామాయంపేట, అక్టోబర్ 30: వరి కొనుగోళ్లపై రామాయంపేటలోని రైతు వేదికలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో తహసీల్దార్ శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో రామాయంపేట, నిజాంపేట మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో 13 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ద్వారా 4 సెంట ర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 1, కోనాపూర్ సొసైటీలో ఒక కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద ఒక వీఆర్వో, ప్రతి రైస్ మిల్ వద్ద కూడా వీఆర్వోలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రాథమిక సహకార సంస్థ ద్వారా ఇన్చార్జి, ట్యాబ్ ఎంట్రీ చేయడానికి ఆపరేటర్‌ను నియమించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అ ధ్యక్షుడు నర్సారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి రాజ్నారా యణ, సీఈవోలు నర్సింహులు,మల్లారెడ్డి తదితరులు న్నారు.