
చేగుంట, అక్టోబర్ 30 : రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నా రు. మండల కేంద్రమైన చేగుంట, వడియారంలో సొసైటీ చైర్మన్ సండ్రుగు స్వామి, నార్సింగి సొసైటీ చైర్మన్ శంకర్‌గౌడ్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సబ్సిడీ ఎరువులు, విత్తనాలతోపాటు రైతుబంధు, రైతు బీమా కల్పించిందన్నారు. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసిందన్నారు. పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో చేగుంట, నార్సింగి ఎంపీపీలు మాసుల శ్రీనివాస్, చిందం సబిత, జడ్పీటీసీలు ముదాం శ్రీనివాస్, బాణపురం కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్‌కుమార్, వైస్ చైర్మన్ ఎన్నం రాజేందర్‌రెడ్డి, సర్పంచుల ఫో రం మండల అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, ఎర్రం అశోక్, ఎంపీటీసీలు వెంకటలక్ష్మి, సత్యనారాయణ, ఆకుల సుజాత, టీఆర్ఎస్ మం డల అధ్యక్షులు వెంగళ్రావు, మైలరాం బాబు, తహసీల్దార్లు విజయలక్ష్మి, సత్యనారాయణ, ఎంపీడీవో ఉమాదేవి, సొసైటీ డైరెక్టర్లు రఘురాములు, స్వర్గం సిద్ధిరాములు, సత్యనారాయణ, రాములు, బాగులు పాల్గొన్నారు.