
సిర్గాపూర్, నవంబర్ 18 : జిల్లాలోని ప్రధాన చెరువులు, ప్రాజెక్టుల్లో ఉచితంగా 34 లక్షల రొయ్య పిల్లలను వదులున్నామని సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సతీష్ తెలిపారు. గురువారం మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులో 1.93 లక్షల రొయ్య పిల్లలను ఆయన వదిలారు. ఈ సందర్భంగా ఏడీ సతీష్ మాట్లాడుతూ జిల్లాలోని సింగూరు, నల్లవాగు ప్రాజెక్ట్లతోపాటు ప్రధాన చెరువులైన మొగుడంపల్లి, ఆస్లాబాద్, అందోల్ పెద్దచెరువు, మల్కాపూర్, కొటిగార్పల్లి పెద్దచెరువు, కుసునూర్ప్రాజెక్ట్ల్లో మొదటి విడుతలో మొత్తం 34 లక్షల రొయ్య పిల్లలను వదులుతున్నామని తెలిపారు. రొయ్యల పెంపకంతో మత్స్య కార్మికులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. ఆయన వెంట సుల్తానాబాద్ మత్స్య సహకార సంఘం చైర్మన్ రవికుమార్, మత్స్యకార్మికులు ఉన్నారు.