
రామచంద్రాపురం, నవంబర్ 17 : చేనేత వస్ర్తాలు, హస్తకళలకు రోజు రోజుకీ ఆదరణ పెరుగుతున్నది. చేనేత వస్ర్తాలు కొనుగోలు చేసేందుకు పెద్దలతో పాటు యువత ఆసక్తి చూపిస్తున్నారు. సిల్క్‌చీరలు, సిల్క్ బట్టల కంటే చేనేత దుస్తువులే శరీరానికి హుందాతనాన్ని ఇవ్వడంతో పాటు సౌకర్యవంతంగా ఉంటాయని అంటున్నారు. సమైక్యరాష్ట్రంలో నిర్వీర్యమైన చేనేత రంగాన్ని స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్వవైభవం తీసుకువచ్చింది. చేనేత రంగం గొప్పదనాన్ని ప్రజలకు తెలిసేలా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచింది. చేనేత కార్మికులు, హస్తకళాకారులపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ఈ రెండు రంగాలకు పెద్దపీట వేసి అభివృద్ధి చేశారు. దీంతో చేనేతపై ప్రజలు మక్కువ పెంచుకున్నారు. హస్తకళా రంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో తమ బతుకులు బాగుపడ్డాయని కళాకారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేనేత, హస్తకళలను ప్రజలకు మ రింత చేరువ చేసేందుకు పలు చోట్ల ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. భెల్‌లోని కనకదుర్గాదేవి ఆలయం పక్కన నిర్వహిస్తున్న చేనేత, హస్తకళా ప్రదర్శన వినియోగదారులతో కిటకిటలాడుతున్నది. భెల్ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం వచ్చి తమకు కావాల్సినవి కొనుగోలు చేస్తున్నారు.
చేనేత ప్రదర్శనలో లభించేవి..
భెల్‌లో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళా ప్రదర్శనలో పోచంపల్లి, నారాయణపేట్, ఉప్పాడ, చీరాల, మంగళగిరి, కళంకారి చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాన్సీ ఖాదీ, ప్రిం టెడ్ బెంగాల్ కాటన్ చీరలు, కాంత్వర్క్ కాటన్, గుజరాత్ డిజైన్ టాప్స్, లక్నో చికన్ వర్క్, రాజస్థానీ ప్రింటెడ్ టాప్స్, జైపూర్ టాప్స్, ఖాదీ షర్ట్స్, భాగల్పూర్ సిల్క్, బాంద్ని సిల్క్, డోర్కర్టన్స్, డోర్‌మ్యాట్స్, వరంగల్ టవల్స్, బెడ్‌షీట్స్, స్టోన్ ఆర్నమెంట్స్, సారంగ్పూర్ వుడ్ ఐటెమ్స్, సిరామిక్ వస్తువులు, గృహోపకరణాలు లభిస్తున్నాయి.
చేనేతను ప్రోత్సహించాలి..
చేనేత రంగాన్ని అందరూ ప్రోత్సహించాలి. చేనేత చీరలు, బట్టలు చాలా బాగుంటాయి. పెద్దవారికైనా, చిన్నవారికైనా మంచి లుక్, సౌకర్యాన్ని ఇస్తాయి. బయట షాపింగ్ సెంటర్లతో పోల్చుకుంటే చేనేత, హస్తకళా ప్రదర్శనలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి. ప్రతిసారి చేనేత ప్రదర్శనకు పిల్లలతో వచ్చి బట్టలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తాం. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అందరికీ చేనేత గొప్పదనం తెలిసింది.
చేనేత రంగానికి డిమాండ్ పెరిగింది..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో చేనేత, హ స్తకళకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. చేనేత వస్ర్తాలపై ప్రజలు ఆసక్తి పెంచుకుంటున్నారు. బయటి మార్కెట్ షోరూంలో కంటే మా ప్రదర్శనలోనే తక్కువ ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి. ఎనిమిది సంవత్సరాలుగా భెల్‌లో హస్తకళా ప్రదర్శన పెడుతున్నాం. ప్ర స్తుతం ఇక్కడ 40 స్టాల్స్ ఉన్నాయి. ఉదయం 11 గంట ల నుంచి రాత్రి 9 వరకు ప్రదర్శన ఉంటుంది.