
హవేళీఘనపూర్, అక్టోబర్ 31: రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నరని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కూచన్‌పల్లిలో ఐకేపీ కేంద్రం ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలోని రాజ్పేటలో రూ.13లక్షలతో నిర్మించ నున్న హెల్త్‌సబ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా పథకాలను ప్రవేశపెడుతూ వారి అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాజ్పేటకూ చెందిన పలువురు లబ్ధ్దిదారులకు ఇంటింటికీ తిరుగుతూ కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్య క్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, పీఏసీఎస్ చైర్మ న్ హన్మంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, జడ్పీటీసీ సుజాత, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఖాలేద్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షులు అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సర్పం చ్‌లు యా మిరెడ్డి, సరిత,చెన్నాగౌడ్, దేవాగౌడ్, కిషన్, సాయి లు, ఉప సర్పంచ్ బయ్యన్న, ఎంపీటీసీలు మంగ్యా, సిద్ధిరెడ్డి, రాజయ్య, సిద్ధిరెడ్డి, మంగ్యా, ఐకేపీ డీపీఎం మో హ న్, ఐకేపీ ఏ పీఎం భాస్కర్, సొసైటీ డైరెక్టర్ సా యి లు, నాయకులు సతీశ్‌రావు, మేకల సాయిలు, శ్రీనివాస్, నరేందర్‌రెడ్డి, సాయాగౌడ్ పాల్గొన్నారు.
అన్నదాతలకు అండగా ప్రభుత్వం
మెదక్‌రూరల్ , అక్టోబర్ 31:తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నదని మాచవరం పీఏసీఎస్ చైర్మన్ సీతారామయ్య అన్నారు. మెదక్ మండలంలోని చిట్యాలలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ సీతారామయ్య , సర్పంచ్ వెంకటేశంతోకలిసి ప్రారభించారు. ఈసందర్భంగా మాట్లాడు ప్ర భుత్వం రైతుల కోసమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్‌చైర్మన్ రాము లు, టీఆర్ఎస్ నాయకులు సంగమేశ్వర్, టీఆర్ఏ స్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
చేగుంట, అక్టోబర్ 31: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు చిన్నశంకరంపేట, చందంపేట, జంగరాయి, మడూర్ సహకార సంఘాల ఆధ్వర్యంలో రుద్రా రం, చిన్నశంకరంపేట, అంబాజీపేట, కొరివిపల్లి, టీ మందాపూర్ గిరిజన తం డాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతు జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం లక్ష్యంగా పెట్టు కున్నామన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, రైతు బంధు సమితి మండల అధ్యక్షు డు లక్ష్మారెడ్డి , జడ్పీటీసీ పట్లోరి మాధవి, టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్‌లు రాజిరెడ్డి, లక్ష్మణ్, సా యులు, పద్మ, శారద, ఎంపీటీసీలు శివకుమార్, విజయ, సొ సైటీ చైర్మన్లు అంజిరెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడి, చం ద్రం, ఏవో శ్రీనివాస్,సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు తది తరులున్నారు.