
సిర్గాపూర్, నవంబర్ 2 : రైతులు మధ్య దళారులకు అమ్మి మోసపోవొద్దనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేశామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కడ్పల్, బోక్కస్‌గాం, గోసాయిపల్లి, గర్డెగాం, సిర్గాపూర్ గ్రామాల్లో, పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వమే మద్దతు ధరతో రైతు నుంచి ధాన్యాన్ని కొనసాగిస్తున్నదని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకట్రాములు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం సమత, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరావు పాల్గొన్నారు. సిర్గాపూర్‌లో సాయవ్వ, సంజీవులు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
అభివృద్ధి, సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
కల్హేర్, నవంబర్ 2: సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన పథకాలకు రూపకల్పన చేశారని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కృష్ణాపూర్, నాగదర్, రాంచందర్ నాయక్ తండాలో ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గుర్రపు సుశీలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రాంరెడ్డిపేట్, మిర్కాన్పేట్, ఇందిరనగర్, పొమ్యానాయక్ తండా, మహాదేవుపల్లి గ్రామాల్లో ఆత్మకమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి నూతన ప్రాజెక్టులను నిర్మించారన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. రైతులకు పండించిన పంటలకు మద్దతు ధరను అందించి ప్రభు త్వం ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, డీసీసీబీ డైరెక్టర్ గుండు వెంకట్రాములు, కృష్ణాపూర్, నాగదర్ సర్పంచ్‌లు కిష్టారెడ్డి, రవీలా, ఏడీఏ కరుణకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ అలీ, ఆర్బీఎం అధ్యక్షుడు దుర్గారెడ్డి, బాచేపల్లి పీఏసీఎస్ చైర్మన్ సంగారెడ్డి, ఎపీఎం సాయిలు, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశంగుప్త, అంజయ్య సాగర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.