
మెదక్, నవంబర్ 2 : వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్‌లోని క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మెదక్ జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. మంగళవారం పాపన్నపేట మండలంలో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు వివరించారు. మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకుకెళ్లి పరిష్కరించారు. అనంతరం 68 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.29,41,500 విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్‌గౌడ్, కమిషనర్ శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, శ్రీనివాస్, కిశోర్, మెదక్, నిజాంపేట మండలాల అధ్యక్షులు అంజాగౌడ్, సుధాకర్‌రెడ్డి, మెదక్, రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్లు హన్మంతరెడ్డి, చంద్రం, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, మధుసూదన్‌రావు, శ్రీధర్‌యాదవ్, సాయిరాం, మధు, సుమన్, బొద్దుల కృష్ణ, దుర్గప్రసాద్, అంజాద్, కిషన్, మహ్మద్, రుక్మాచారి, మండలాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.