ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసుశాఖ నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. మద్యం, డబ్బు అక్రమంగా రవాణా కాకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. వచ్చీపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నది. నిత్యం పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూనే సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ సలహాలు.. సూచనలు ఇస్తుండగా, సిబ్బంది ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల నేపథ్యంలో అధికారులతో పాటు పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. జిల్లాలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు మారుమూల గ్రామాలపై ప్రత్యేక దృ ష్టి పెట్టారు. జిల్లాలోని 597 పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు సందర్శించడంతో పాటు సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను పరిశీలిస్తున్నారు. ఎస్పీ సురేశ్‌కుమార్ స్వయంగా మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ గిరిజనులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, కొత్త వారెవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు గట్టి బందోబస్తు మధ్య ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
2018 ఎన్నికల్లో జిల్లాలో 3,71,444 మంది ఓటర్లుండగా, ఈసారి ఓటర్ల సంఖ్య 4,47,934కు చేరింది. అంటే 76,490 మంది ఓటర్లు పెరిగారు. అందుకనుగుణంగా జిల్లాలో 597 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో సుమారు 190 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుండగా, 122 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. నవంబర్ 30న జరిగే పోలింగ్‌తో పాటు డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ వరకూ ప్రతి విషయాన్ని పోలీసులు, అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా 24గంటలు పనిచేసే విధంగా 1950, 08733279411 నంబర్లను అందుబాటు లో ఉంచారు. సీ-విలేజ్ ద్వారా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. గత ఎన్నికల్లో వివాదాలకు కారణమైన వారిపై దృష్టి పెట్టారు.
ఆసిఫాబాద్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి రాకపోకలు సాగించే రహదారుల వద్ద ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశా రు. వాంకిడి, వెంకట్రావ్‌పేట్, కెరమెరి, దహెగాం, బెజ్జూర్ ప్రాంతాలపై నిరంతర నిఘాతో పాటు పొ రుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ప్రాణహిత సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ సురేశ్‌కుమార్ స్వయంగా కెరమెరి మండలంలోని బార్డర్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో అతిసమస్యాత్మకంగా పేరుగాంచిన చాల్బడి గ్రామాన్ని సందర్శించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితో ఇప్పటికే కలెక్టర్ బోర్కడే హేమంత్ పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో అధికారులు కోడ్‌ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, రోడ్లపై ఉన్న రాజకీయ ప్రకటనలకు సంబంధించిన బోర్డులను తొలగిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. మద్యం, డబ్బు తరలింపుపై నిఘా పెట్టారు. రూ. 10 వేల కంటే ఎక్కువ విలువగల మద్యం తరలిస్తే పట్టుకునేలా ఆంక్షలు పెట్టారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదనే ఆంక్షలు పెట్టారు. సర్వేలెన్స్ టీంలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంపై, ప్రతి పోలింగ్ కేంద్రంపై దృష్టిసారించారు. రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంగా చేసే ఖర్చులపై కూడా ప్రత్యేక అధికారులు బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. వీడియో రికార్డులు చేయడంతోపాటు రాజకీయ నాయకుల ప్రచారాలపై దృష్టిపెట్టారు.
ఆదిలాబాద్, అక్టోబర్ 13 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ పార్టీలు ప్రజలను ప్రభావితం చేయకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 10 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లాలో సరిహద్దులో మహారాష్ట్ర ఉండడంతో అక్కడి నుంచి డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రాకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులో మూడు చెక్‌పోస్టులు ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలోని జైనథ్ మండలం పిప్పర్వాడ, బోథ్ నియోజకవర్గం పరిధిలో బోథ్ మం డలం ఘన్పూర్, తలమడుగు మండలం లక్ష్మీపూర్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితోపాటు జైనథ్ మండలం ఆనంద్‌పూర్, బేల మండ లం శంకర్‌గూడ, భీంపూర్ మండలం కరంజి, గాదిగూడ మండలం మేడిగూడ, నేరడిగొండ మండలం రోల్మామడ, ఉట్నూర్ మండలం, ఉట్నూర్ ఎక్స్‌రోడ్, కొత్తగూడలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.ణా, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీశాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. 24 గంటల వీటిల్లో తనిఖీలు కొనసాగుతాయి, సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశా రు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ.. చెక్‌పోస్టులను క్ర మంగా సందర్శిస్తూ సిబ్బందికి సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ఎ న్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే వస్తువులు, రూ.50వేల నగదు, మ ద్యం, ఇతర వస్తువుల రవాణాను అరికట్టడానికి చెక్‌పోస్టుల్లో సిబ్బంది వి స్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారు. ఎన్నికల సమయంలో నిబంధనలు పా టించని వారిపైకఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సూచిస్తున్నారు.