Sabitha Indra Reddy | వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి : సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy | వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు పడకుండా శానిటేషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మీర్‌పేట : వర్షాకాలం ( Monsoon ) లో ప్రజలకు ఇబ్బందులు పడకుండా శానిటేషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indra Reddy ) అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్, మీర్పేట్ డివిజన్లో ఉన్న మిథిలానగర్‌లో కొనసాగుతున్న ఎస్ఎన్డీపీ( SNDP ) నాలా అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసు కున్నారు. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు.నాలా పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
డ్రైనేజీ వ్యవస్థలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టిని తొలగించి వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఆమె వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

