M-Capitalisation | గతవారం జరిగిన ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,91,622.95 కోట్లు పెరిగింది. బజాజ్ ఫైనాన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా లాభ పడ్డాయి. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) నష్టపోయాయి. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్లో గత వారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,498.02 పాయింట్లు లబ్ధి పొందింది.
బజాజ్ ఫైనాన్స్ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.57,673.19 కోట్లు పెరిగి రూ. 4,36,447.88 కోట్లకు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం -క్యాప్ రూ.47,494.49 కోట్లు లాభ పడి రూ.12,07,779.68 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,481.09 కోట్లు వృద్ధి చెంది రూ. 7,97,251.18 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.18,219 కోట్లు లాభపడి రూ.6,52,012.91 కోట్ల వద్ద స్థిర పడింది.
హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్డీఎఫ్సీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,978.42 కోట్లు పెరిగి రూ.4,31,679.65 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.12,940.69 కోట్లు లాభ పడి రూ.4,71,397.99 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,873.62 కోట్లు వృద్ధి చెంది రూ.5,69,400.43 కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ. 3,962.45 కోట్లు అభివృద్ధి చెంది రూ.16,97,208.18 కోట్ల వద్ద స్థిర పడింది.
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,020.75 కోట్లు నష్టపోయి రూ.4,28,739.97 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ. 810.61 కోట్లు పతనమై రూ.6,19,551.97 కోట్లకు చేరుకున్నది. టాప్-10 సంస్థల్లో రిలయన్స్ లీడ్లో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ నిలిచాయి.