Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు రూ.1,19,763.25 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. దేశీయ మార్కెట్లలో సానుకూల పరిణామాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 561.89 పాయింట్లు (0.86 శాతం) లబ్ధి పొందింది. ఈ నెల ఏడో తేదీన సెన్సెక్స్ 65,898.98 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.57,338.56 కోట్లు లబ్ధి పొంది రూ.17,83,043.16 కోట్లకు దూసుకెళ్లింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.21,291.04 కోట్లు పెరిగి రూ.5,82,602.45 కోట్ల వద్ద స్థిర పడింది.
ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) రూ.18,690.06 కోట్లు పెరిగి రూ.5,29,898.83 కోట్ల వద్ద ముగిసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.9,220.81 పెరిగి రూ.12,16,890.72 కోట్ల వద్ద నిలిచింది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.8,998.26 కోట్లు వ్రుద్ధి చెంది రూ.6,62,702.30 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,217.52 కోట్లతో రూ.6,33,532.04 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,926.37 కోట్లు పతనమై రూ.9,28,657.99 కోట్లతో సరిపెట్టుకున్నది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.9,782.7 కోట్లు హరించుకుపోవడంతో రూ.5,12,585.94 కోట్ల వద్ద నిలిచింది.
భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.5,219.66 కోట్లు కోల్పోయి రూ.4,83,844.10 కోట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.1,638.41 కోట్లు పతనమై రూ.5,52,452.86 కోట్ల వద్ద స్థిర పడింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ లీడ్ లో కొనసాగుతుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్ టెల్ నిలిచాయి.