స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి మంకెన కోటిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరారు. ఆదివారం మిర్యాలగూడలో మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలుపలేదని, పార్టీ గుర్తుతో పోటీలో ఉంటే
పరువు పోతుందని కొంతమందిని ఇండిపెండెంట్లుగా బరిలో దింపిందని విమర్శించారు. ఎన్నికలేవైనా టీఆర్ఎస్ విజయం ఖాయమని స్పష్టం చేశారు.
మిర్యాలగూడ, డిసెంబర్ 5 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంకెన చిన కోటిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం వైష్ణవి గ్రాండ్ హోటల్లో మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓటర్లు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. నమూనా బ్యాలెట్ చూపించి ఓటింగ్ విధానాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిని నిలిపే సత్తా లేక ముందుగానే ఓటమిని అంగీకరించిందని పేర్కొన్నారు. పార్టీ గుర్తుతో పోటీలో ఉంటే పరువు పోతుందని కాంగ్రెస్ నాయకులు కొంతమంది పార్టీకి చెందిన వారినే ఇండిపెండెంట్లుగా బరిలో నిలిపారని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికీ చేరాయని, ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్కే బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. పార్టీలో కష్టపడి పని చేసేవారికి మంచి గుర్తింపు ఉంటుందని, నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడమే దీనికి నిదర్శనమని తెలిపారు. రెండు నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అత్యధికంగా ఉన్నారని, పార్టీ అభ్యర్థి గెలుపునకు మీరంతా కట్టుబడి ఉండాలని సూచించారు. కోటిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని సూచించారు.
సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి : ఎమ్మెల్సీ గుత్తా
రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, అందుకే సీఎం కేసీఆర్‌కు ప్రజలు రెండు పర్యాయాలు అధికారాన్ని అప్పగించారని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతతోనే మన రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే ప్రజా సంక్షేమంలో ముందుందని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని, అందుకే ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకే జై కొడుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే భగత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కోటిరెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.