హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓట రు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026) ఓటర్ల సర్వే డ్రాఫ్ట్ జాబితా కొలికి వస్తున్నకొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల నుంచి 70 లక్షల మం ది ఓటర్లు తగ్గే అవకాశం ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నది. సీఈవో కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు అం దిన గణాంకాల ప్రకారం 77.12 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది.
ఇప్పటికే 44 లక్షల మంది ఓటర్లు ఇచ్చిన చిరునామాలో అందుబాటులో లేరని అధికారులు గుర్తించారు. ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ఆగస్టు 3వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో గడువు తేదీని ఆగస్టు 10 వరకు పొడిగించారు. పది రోజు ల సమయం ఉన్నందున, ఆబ్సెంట్, షిఫ్టె డ్, డెడ్, డూప్లికేట్(ఏఎస్‌డీడీ) ఓటర్ల సం ఖ్య సులభంగా 50 లక్షల మారును దా టుతుందని, ప్రక్రియ పూర్తయ్యేసరికి ఇది 65 నుంచి 70 లక్షల వరకు చేరే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో 3,38,26,448 ఓటర్లుండ గా , వారికి బూత్ లెవల్ అధికారులు ఎ న్యుమరేషన్ ఫామ్‌లు(ఈఎఫ్) పంపిణీ చే శారు. శుక్రవారం వరకు 2,60,88,334 (77.12%) ఫామ్‌లను అధికారులు డిజిటలైజ్ చేశారు. ఇంకా 77,38,114 (సుమారు 22.88%) ఫామ్‌లు డిజిటలైజ్ చే యాల్సి ఉన్నది. అయితే క్షేత్రస్థాయిలో బీ ఎల్వోలు సేకరించిన ప్రాథమిక వివరాల ప్రకారం సుమారు 55 లక్షలకు పైగా ఓటర్ల వివరాలు అందుబాటులో లేవని తెలుస్తున్నది. ఎన్యుమరేషన్ ఫామ్‌లు అందనివా రు, ఇతర రాష్ట్రాలు/ప్రాంతాలకు వలస వె ళ్లిన ఓటర్లు, మరణించినవారు, ఇంకా వెరి ఫై చేయాల్సిన లొకేషన్ మార్పులు, నకిలీ ఓట్ల ఏకీకరణ పూర్తయితే ఈ సంఖ్య మరో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గల్లంతవుతున్న ఓటర్లలో సగానికిపైగా (సుమారు 25 లక్ష ల మందికిపైగా) వేరే ప్రాంతాలకు లేదా ని వాసాలకు మారినవారు ఉన్నారు. సుమారు నాలుగు లక్షల మంది ఓటర్లు మరణించినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో నివసిస్తున్న ఓటర్లలో చాలామంది సొంత ప్రాంతాల్లోనే ఓటు హకు కలిగి ఉండటానికి మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల తెలంగాణలోని ఓటరు జాబితా నుంచి వీరి పేర్లు తొలగిపోతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మలాజిగిరి, రంగారెడ్డి వంటి పట్టణ జిల్లాల్లో నివాస స్థలాల మార్పు, వలసల శాతం అత్యధికంగా ఉండటం వల్ల, ‘సర్’ ప్రక్రియ పూర్తయ్యేనాటికి గల్లంతయ్యే లేదా ఏఎస్‌డీడీ జాబితాలోకి చేరే మొత్తం ఓట్ల సంఖ్య 65 లక్షల నుంచి 70 లక్షల భారీ మారును తాకుతుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో గ్రామీణ జిల్లాల్లో ఫామ్‌ల డిజిటలైజేషన్ దాదాపు పూర్తికావచ్చింది. యాదాద్రి భువనగిరి 94.25 శాతంతో టా ప్లో నిలిచింది. జనగామ 91.44 శాతం, మహబూబాబాద్ 90.08 శాతం, సూర్యాపేట 90.35 శాతం, మెదక్ 90.52 శాతం తదుపరి వరుసలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో బీఎల్వోలు వంద శాతం ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. వేగంగా పనిచేసిన ఆయా బీఎల్వోలను అధికారులు సన్మానించారు. అత్యల్పంగా హైదరాబాద్‌లో 56.31 శాతం, మేడ్చల్ మలాజిగిరి 61.37 శాతం, రంగారెడ్డి జిల్లాలో 63.43 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది.
మొత్తం ఓటర్లు: 3,38,26,448 మంది
పంపిణీ చేసిన ఈఎఫ్‌లు: 3,38,26,448 (100.00%)
డిజిటలైజ్ చేసిన ఈఎఫ్‌లు: 2,60,88,334 (77.12%)
పెండింగ్:77,38,114 (సుమారు 22.88%)