రుద్రంపూర్, మార్చి 28 : సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే నూతన బొగ్గు బ్లాకులను తక్షణమే ప్రారంభించాలని, కార్మికులపై పడుతున్న ఆదాయపు పన్ను భారాన్ని కోల్ ఇండియా తరహాలో కంపెనీయే భరించాలని, లేనిపక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం
సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ‘సేవ్ సింగరేణి జాతా’లో భాగంగా రుద్రంపూర్ ప్రాంతంలో ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్మికులు పాల్గొన్న ఈ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. యాజమాన్య తీరుపై నిప్పులు చెరిగారు. పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును కొనసాగించాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
కార్పొరేట్ స్థాయిలో జరిగిన స్ట్రక్చర్ కమిటీ ఒప్పందాలను అమలు చేయకపోతే రానున్న రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. శాసనసభలో సింగరేణి కార్మికుల గొంతుకగా నిలిచిన ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు శాసనసభలో సింగరేణి కార్మికుల గొంతుకగా నిలిచిన ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు తీరును కొనియాడారు. “సింగరేణి మనుగడ కోసం, కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అని. కార్మికుల పక్షాన ఆయన చేస్తున్న పోరాటాన్ని ఆయన వివరించారు. మార్చి 30న ముగియనున్న ఈ జాతారలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఏకమై తమ హక్కులను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్మికుల చిరకాల వాంఛ అయిన సొంత ఇంటి పథకాన్ని వెంటనే అమలు చేయాలి.

రుద్రంపూర్ లో ‘సేవ్ సింగరేణి’ భారీ బైక్ ర్యాలీ
ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మికుల చిరకాల వాంఛ అయిన సొంత ఇంటి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ అన్-ఫిట్ అయిన కార్మికుల డిపెండెంట్లకు, వివిధ కారణాలతో ఆగిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని, ఎన్-1 సర్క్యులర్‌ను రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ స్థాయిలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని, లేదంటే సింగరేణి వ్యాప్తంగా కార్మిక గర్జన తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జాతాను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు వీరభద్రం, వై వి రావు, ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి,గట్టయ్య, సందేబోయిన శ్రీనివాస్, నాగేశ్వరరావు, రాము, గుమ్మడి వీరయ్య, హీరాలాల్,ఎంఆర్‌కె ప్రసాద్,కమల్, మధు కృష్ణ, రాజేశ్వరరావు, సాంబమూర్తి, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.