మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జూరాలకు వరద కొనసాగుతున్నది. నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. అక్కడి నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మంగళవారం ఉదయం జూరాల ప్రాజెక్టు 27 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
మంగళవారం ఉదయం 9 గంటల నాటికి జూరాల ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరగా.. ప్రాజెక్టు నుంచి మొత్తం 2,13,548 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో స్పిల్వే ద్వారా 1,80,255 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా 28,369 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 317.47 మీటర్లకు చేరగా.. మొత్తం నీటి నిల్వ 7.59 టీఎంసీలుగా ఉంది. ఇందులో లైవ్ స్టోరేజ్3.883 టీఎంసీలు నమోదైంది.