కొవిడ్-19.. మూడేళ్లు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. లాక్డౌన్స్, కఠిన నిబంధనలు, టీకాలతో మహమ్మారి కాస్త శాంతించినా.. మళ్లీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలను వణికిస్తున్నది. కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో మాస్క్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు జమ్మూ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో 1,200 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో 390, జమ్మూలో 519 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కార్యాలయాలు, దవాఖానలు, స్కూల్స్, మాల్స్, బ్యాంకులు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లలాంటి పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్‌లో మాస్కులు తప్పనిసరి చేశారు. అలాగే, హైవేలు, రైల్వే స్టేషన్లలో కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాస్కుతోపాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్‌ను తప్పనిసరిగా వాడాలని అధికారులు సూచించారు.